జేబు ఖాళీ.. ధైర్యం ఫుల్! 2 చీరలతో భారత్ యాత్ర

విలాసవంతమైన ప్రయాణాలకు భిన్నంగా సరస్వతి నారాయణ్ అయ్యర్ చేస్తున్న యాత్ర ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉద్యోగాన్ని వదిలి ప్రయాణం మొదలుపెట్టిన ఆమె.. రెండు చీరలు, టెంట్, పవర్‌బ్యాంక్ వంటి కొన్ని వస్తువులతో భారత్‌ను అన్వేషిస్తున్నారు. నడక, హిచ్‌హైకింగ్ ద్వారా ప్రయాణిస్తూ అవసరమైన చోట స్థానికుల సహాయం తీసుకుంటున్నారు. ఆలయాలు, ధర్మశాలలు, ఆశ్రమాల్లో బస చేస్తూ.. తన ప్రయాణ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.



