జపాన్‌లో వారసత్వ వివాదం..

జపాన్ చక్రవర్తి నరుహిటో కుమార్తె ప్రిన్సెస్ ఐకోకు ప్రజల్లో భారీ ఆదరణ ఉన్నా, చట్టం ప్రకారం ఆమె సింహాసనం అధిష్ఠించలేరు. కారణం.. వారసత్వ హక్కు పురుషులకే పరిమితం కావడం.. మైనిచి పత్రిక సర్వేలో 72% మంది మహిళా చక్రవర్తికి మద్దతిచ్చారు. అయినా ప్రభుత్వం మహిళలకు అవకాశం ఇవ్వలేదు. రాజవంశాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతుండగా, మహిళలకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదన్న ప్రశ్నలు కొనసాగుతున్నాయి.



