ఫైబర్ డైట్ అందరికీ సెట్ అవ్వదు.. ఎందుకో తెలుసా?

హెల్త్ కోసం ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలని చాలామంది డైట్‌లో మార్పులు చేస్తున్నారు. అయితే అందరికీ ఒకే డైట్ పనిచేయదని డాక్టర్ జీన్ లీవ్ చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు, పప్పులు, ఓట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ సరిగ్గా జరగడానికి సాయపడుతుంది. అయితే ఒక్కసారిగా ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే కడుపు ఉబ్బడం వంటి సమస్యలు రావచ్చు. అందుకే మన శరీరానికి ఏది సరిపోతుందో చూసుకుని డైట్‌లో మార్పులు చేసుకోవాలి.



