← Back to news

హైకోర్టు సమీపంలో భారీ అగ్నిప్రమాదం

By Bala· 1h ago

హైదరాబాద్‌ ఓల్డ్ సిటీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హైకోర్టు సమీపంలోని మదీనా క్రాస్‌ రోడ్‌ వద్ద ఉన్న ‘బాంబే హోజరీ’ వస్త్ర దుకాణం, గోదాములో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, చార్మినార్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

More in Local