← Back to news

పోలీస్ కళాబృందంతో ప్రయాణికులకు అవగాహన

By Bala· 56m ago
పోలీస్ కళాబృందంతో ప్రయాణికులకు అవగాహన

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు సోమవారం జిల్లా బస్టాండ్‌లో పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. మాటలు, పాటల రూపంలో ప్రయాణికులకు పలు అంశాలపై చైతన్యం కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే నష్టాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళల భద్రతపై వివరించి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

More in Local