← Back to news

బ్యాంకులు Gen-Z కోసం మారబోతున్నాయా?

By Nani· 19 Aug 2026
బ్యాంకులు Gen-Z కోసం మారబోతున్నాయా?

బ్యాంకింగ్ అంటే ఇంకా బ్రాంచ్‌కు వెళ్లడం, ఫారాలు నింపడం, గంటల తరబడి వెయిట్ చేయడమేనా? Gen-Zకి మాత్రం ఆ మోడల్ పెద్దగా వర్క్ అవ్వదు. వాళ్లకు కావాల్సింది మరింత ఫాస్ట్, సింపుల్, ఎప్పుడైనా అందుబాటులో ఉండే బ్యాంకింగ్. అందుకే యువత కోసం బ్యాంకింగ్‌ను ఎలా మార్చాలనే దానిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకర్లతో చర్చించారు. కాలేజ్ నుంచే యువతతో బ్యాంకుల సంబంధం మొదలై, ఉద్యోగం, సేవింగ్స్, భవిష్యత్ అవసరాల వరకు కొనసాగాలన్నది ప్రధాన ఆలోచన. రేపటి బ్యాంకింగ్… మరింత మనకు దగ్గరగా ఉండొచ్చు.

More in Gen Z