← Back to news

స్థానిక ఎన్నికలపై కూటమి కీలక భేటీ

By Prashanth· 12 Oct 2026
స్థానిక ఎన్నికలపై కూటమి కీలక భేటీ

AP: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్, BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నారు. చంద్రబాబు నివాసంలో జరిగే ఈ సమావేశంలో TDP, Jana Sena, BJP ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే Jana Sena, BJPలు తాము పోటీ చేయాలనుకుంటున్న స్థానాల జాబితాలను అందించాయి. అక్టోబర్ 14న ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

More in AP