← Back to news

గద్వాలలో కలకలం.. ప్రేమ జంట ఇంటిపై జేసీబీ దాడి

By Bala· 1h ago· TG
గద్వాలలో కలకలం.. ప్రేమ జంట ఇంటిపై జేసీబీ దాడి

TG: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం చోటుచేసుంది. ప్రేమ వివాహం చేసుకున్న దళిత యువకుడి ఇంటిని యువతి కుటుంబ సభ్యులు కూల్చేశారు. గద్వాల మండలం రేపల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువతి, యువకుడు ఇటీవల హైదరాబాద్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో యువకుడి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. జేసీబీలతో ఇంటిని కూల్చివేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

More in TG