← Back to news

నారాయణపేటలో వ్యభిచార ముఠా గుట్టురట్టు

By Bala· 1h ago· TG
నారాయణపేటలో వ్యభిచార ముఠా గుట్టురట్టు

TG: నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో వ్యభిచార ముఠా గుట్టురట్టైంది. నారాయణపేట రోడ్డులోని ఎస్వీఎస్ లాడ్జిపై ఎస్సై రాజు ఆధ్వర్యంలో పోలీసులు ఇవాళ దాడి చేశారు. లాడ్జి యజమాని భాస్కర్‌రెడ్డి, సహాయకుడు లింగప్పతో పాటు ముగ్గురు పురుషులు, ఏడుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 10 సెల్‌ఫోన్లు, రూ.7,800 నగదు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More in TG