← Back to news

MGU ఎంఈడీ పరీక్షల షెడ్యూల్ విడుదల

By Bala· 1h ago· TG
MGU ఎంఈడీ పరీక్షల షెడ్యూల్ విడుదల

TG: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో ఎంఈడీ సెమిస్టర్‌–2 రెగ్యులర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 23 నుంచి అక్టోబర్‌ 3 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు పరీక్షల తేదీలను ముందుగానే పరిశీలించి, అందుకు అనుగుణంగా సన్నద్ధం కావాలని సూచించారు. పూర్తి పరీక్షల షెడ్యూల్‌ను MGU అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

More in TG