పుచ్చకాయ కల్తీ కాదు.. విష ప్రయోగం ?

ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బిర్యానీ తిన్న వెంటనే పుచ్చకాయ తిని మరణించారన్న వార్త తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే వీరు తిన్న పుచ్చకాయలో ఎలాంటి కల్తీ జరగలేదని ఫుడ్ అండ్ సేఫ్టీ అథారిటీ పరీక్షల్లో తేలింది. మృతుల్లో కొంతమంది అవయవాలు ఆకుపచ్చగా మారడాన్ని పోస్టుమార్టమ్ నివేదికలో వెల్లడి కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ కుటుంబంపై బలమైన విష ప్రయోగం జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఆ దిశగా మరిన్ని పరీక్షలు చేస్తున్నారు. ఆ నివేదికలు వస్తే అసలు నిజాలు బయటకొస్తాయి.


