వంటగ్యాస్ కొరత..ఇండక్షన్ స్టవ్‌ల వైపు జనం

పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధ ప్రభావంతో దేశంలో వంటగ్యాస్ కొరత తీవ్రమైంది. సిలిండర్ల ధరలు పెరగడం, సప్లై ఆలస్యం కారణంగా చాలామంది ఇండక్షన్ స్టవ్‌ల వైపు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇండక్షన్ స్టవ్‌ల డిమాండ్ పెరగడంతో ధరలు 20 నుంచి 30 శాతం పెరిగాయి. కొన్ని చోట్ల ఆన్‌లైన్‌లో కూడా స్టాక్ అయిపోయింది. ఫ్లిప్‌కార్ట్ ప్రకారం ఇండక్షన్ కుక్‌టాప్‌ల విక్రయాలు నాలుగు రెట్లు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్‌లను ప్రోత్సహించాలని యోచిస్తోంది.

