అల్లు అర్జున్ స్పెషల్ వీడియో కాల్.. ఆ చిన్నారి ఎవరంటే?
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శ్రద్ధ అనే చిన్నారి, అల్లు అర్జున్‌తో మాట్లాడాలని ఆశపడింది. ఈ విషయం తెలుసుకున్న ఒక NGO టీమ్ ఆయనను కాంటాక్ట్ చేయగా, బన్నీ వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఆ చిన్నారికి వీడియో కాల్ చేసి స్పెషల్‌గా మాట్లాడారు. ఎంతో ప్రేమతో పలకరిస్తూ ఆ పాప ఫేస్‌లో హ్యాపీనెస్ తెచ్చారు. చిన్నారి కోరికను తీర్చి, ధైర్యం చెప్పిన బన్నీ తన మంచి మనసు చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కాల్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

