డిగ్రీ ఒక్కటే కాదు.. Gen Zకి స్కిల్స్ కూడా కావాలి!

Gen Zలో చాలామంది చదువుతో పాటు కొత్త స్కిల్స్ నేర్చుకోవడంపై ఫోకస్ పెడుతున్నారు. 2025 సర్వేలో భారత్‌కు చెందిన 94% Gen Z.. ఉద్యోగంలోనే కొత్త విషయాలు నేర్చుకోవడం కెరీర్‌కు చాలా ఉపయోగమని చెప్పారు. AI, కంటెంట్ క్రియేషన్, డిజైన్ వంటి రంగాల్లో కొత్తగా నేర్చుకోవాలనే ఆసక్తి కనిపించింది. అంటే “డిగ్రీ పూర్తయింది.. అంతే” అనే ఆలోచన కంటే, ఎప్పటికప్పుడు కొత్తది నేర్చుకోవడానికే Gen Z ఎక్కువ ప్రయార్టీ ఇస్తోంది. కొత్త మార్పులను గమనిస్తూ, అందుకు తగినట్లుగా తమను తాము మౌల్డ్ చేసుకుంటోంది యూత్.



