← Back to news

రైల్వే స్టేషన్‌లో చావు అంచున ఉన్న ప్రయాణికుడిని కాపాడిన కానిస్టేబుల్ గీత..

By sahani· 11 Apr 2026· Telugu Report· Uttar pradesh

ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గీత చేసిన సాహసం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కదులుతున్న రైలు ఎక్కబోయి పట్టుతప్పి ప్లాట్‌ఫారమ్, రైలు మధ్య ఖాళీలో పడిపోతున్న ఒక ప్రయాణికుడిని ఆమె మెరుపు వేగంతో స్పందించి పక్కకు లాగారు. కేవలం సెకన్ల వ్యవధిలో గీత సమయస్ఫూర్తి ఆ ప్రయాణికుడి ప్రాణాలను కాపాడింది. ఆమె ధైర్యసాహసాలను చూసి తోటి ప్రయాణికులు ప్రశంసలు కురిపించారు.

More in Motivational

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?
Motivational· 2d ago

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?

వందమంది మనల్ని మెచ్చుకున్నా.. ఒక్కరు “బాగా చేయలేదు” అంటే ఆ మాటే రోజంతా మన తలలో తిరుగుతుంది. ఇది మనలో ఏదో లోపం ఉందని కాదు.. మెదడు నెగెటివ్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా పనిచేయడమే కారణం. ప్రమాదాలు, విమర్శలు, తిరస్కరణలు గుర్తుపెట్టుకోవడం మనుగడకు ఉపయోగపడేది. అందుకే మంచి అనుభవాల కంటే చెడు మాటలు ఎక్కువగా గుర్తుండిపోతాయి. అయితే ప్రతి కామెంట్ నిజం కాదు. ఒక్కరి అభిప్రాయాన్ని మన విలువకు కొలమానంగా మార్చుకుంటే.. వంద నిజమైన ప్రశంసల విలువను మనమే తగ్గించినట్టే. అది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే.