భార్యను ఆటపట్టించిన ధోని (Video)
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ MS ధోనీ, భార్య సాక్షీతో కలిసి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంబానీ ఫ్యామిలీ నిర్వహించిన నవరాత్రి కార్నివాల్‌లో పాల్గొన్నాడు. అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్‌తో కలిసి డ్రాగన్ బోట్ రైడ్‌ను ఎంజాయ్ చేసిన ఈ జంట, ఐస్‌క్రీమ్ ప్రాంక్ వీడియోతో సోషల్ మీడియాను కుదిపేశారు. సాక్షీకి ధోనీ చెంచాతో ఐస్‌క్రీమ్ అందించి, ఆమె నోరు తెరవగానే తానే తినేశాడు. ఇలా రెండుసార్లు చేశాడు. ఈ వీడియో వైరల్ అయ్యింది.
