ఫేక్ అకౌంట్లతో బ్లాక్‌మెయిల్

అమ్మాయిల పేర్లతో ఫేక్ అకౌంట్లు సృష్టించి, ప్రైవేట్ ఫొటోలతో బెదిరించిన కేసులో కొండబత్తుల పవన్ కుమార్‌ను సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 13, ఫేస్‌బుక్‌లో 14 అకౌంట్లతో వెయ్యి మందికి పైగా పరిచయం పెంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 82 మంది నుంచి ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు పొందినట్లు దర్యాప్తులో తేలింది. బ్లాక్‌మెయిల్‌తో 18 లక్షల రూపాయలు, పెట్టుబడుల పేరుతో మరో 7.16 లక్షలు మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.


