← Back to news

కోల్‌కతాలో దుర్గాదేవి మండపం దగ్గర తొక్కిసలాట.. 17 మంది మృతి!

By Nani Eluri· 2d ago· X

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో దుర్గాపూజ పండల్ దగ్గర శనివారం రాత్రి తొక్కిసలాట జరిగింది. చోర్‌బాగాన్ సార్వజనిన్ పూజా పండల్ దగ్గర భారీగా జనం చేరడంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. ఈ ఘటనలో 17 మంది చనిపోగా, 35 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని కలకత్తా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే సీఎం సువేందు అధికారి ఆసుపత్రికి చేరుకుని బాధితుల పరిస్థితిని తెలుసుకున్నారు.

More in National