రిలీజ్ కాగానే అభిజీత్ దీప్కే కామెంట్స్
ఢిల్లీ నిరసనల్లో ప్రివెంటివ్ అరెస్ట్ నుంచి రిలీజ్ అయిన అభిజీత్ దీప్కే తదుపరి యాక్షన్ ప్లాన్‌పై కీలక కామెంట్స్ చేశారు. ఇల్లీగల్ అరెస్టులతో తమను భయపెట్టాలని చూస్తున్నారని, కానీ తాము తగ్గేదేలేదని స్పష్టం చేశారు. కస్టడీలో ఉన్న సౌరవ్, ఆషు ఈరోజే రిలీజ్ అవుతారని, వారు రాగానే అందరం కలిసి కొత్త వ్యూహంతో పెద్ద యుద్దానికి రెడీ అవుతామని చెప్పారు. లీగల్ మ్యాటర్స్ డిస్కస్ చేయడానికి సీనియర్ అడ్వకేట్ బృందా గ్రోవర్ వద్దకు వెళ్తున్నట్లు తెలిపారు.


