బాలీవుడ్‌లో హీరోయిన్లదే రాజ్యమా!

ఈమధ్య బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ట్రెండ్ అవుతున్నాయి. కేవలం హీరోల చుట్టూనే కాకుండా, హీరోయిన్లు లీడ్ రోల్స్ చేసే యాక్షన్, థ్రిల్లర్ సినిమాలపై నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతున్నారు. ప్రేక్షకులు కూడా హీరోనా, హీరోయిన్ అని చూడకుండా మంచి కథలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. థియేటర్లే కాకుండా ఓటీటీ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయం కూడా రిస్క్‌ను తగ్గిస్తుండటంతో, రాబోయే రోజుల్లో లేడీ ఓరియెంటెడ్ ఉన్న భారీ బడ్జెట్ సినిమాలు మరింత పెరగనున్నాయి.



