భయం లేని బాల్యం.. బాలికల హక్కు

నేడు ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే. చదువు, సేఫ్టీ, సమాన హక్కులు ప్రతి బాలికకు దక్కాలనే విషయంపై ఈ రోజు అవగాహన కల్పిస్తారు. కానీ ఇండియాలో ఇప్పటికీ అమ్మాయిలకు వేధింపులు, లైంగిక హింస, బాల్య వివాహాల భయం తప్పడం లేదు. బయటకు వెళ్లినా, తిరిగి ఇంటికి వచ్చేవరకు సేఫ్‌గా చేరుతామా అనే టెన్షన్ చాలామందిలో ఉంది. అమ్మాయిలు ఏం వేసుకోవాలి, ఎక్కడికి వెళ్లాలి అని చెప్పడం కాదు.. వాళ్ల భద్రతకు బాధ్యత తీసుకోవాలి. ప్రతి బాలిక భయం లేకుండా చదువుకోవాలి, తన భవిష్యత్తును తానే ఎంచుకోవాలి. అదే నిజమైన సమానత్వం!



