హర్ముజ్ దగ్గర ఆగిపోయిన 15 ఇండియన్ షిప్స్

హర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించడంతో పశ్చిమాసియాలో మళ్లీ టెన్షన్ వాతవరణం నెలకొంది. హర్ముజ్ మీదుగా రావాల్సిన 15 భారతీయ నౌకలు అక్కడే చిక్కుకుపోయాయి.వీటిలో ఎక్కువ ఎల్ఎన్ జీ, ఆయిల్ ట్యాంకర్లు, క్రూడాయిల్ వెస్సల్స్ ఉన్నాయి. వీటితో పాటు ఒక కెమికల్ కంటైనర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ వి కాని నౌకలపై నేరుగా నిషేధం లేకపోయినప్పటికీ జలసంధి దగ్గర నౌకల్ ట్రాకింగ్ మాత్రం బాగా స్లో అయిపోయింది. కాస్త రిలీఫ్ పొందే విషయం ఏమంటే మన నౌకలు మొత్తం 25 ఉంటే పది నౌకలు సేఫ్క్క గా అక్కడ నుంచి దాటేశాయి.



