2700 రూపాయల మందుకు 27 వేల MRP!

క్యాన్సర్ మందుల ధరలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. రిటైలర్‌కు 2,700 రూపాయలకు ఇచ్చే ఓ మందుపై MRP 27,000 రూపాయలుగా ఉండటంపై ప్రశ్నించింది. అంటే ధరలో ఏకంగా 10 రెట్ల తేడా! ఇలాంటి ధరలతో పేషెంట్లపై భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని మందుల ధరలపై ప్రభుత్వం కంట్రోల్ పెట్టినా, అన్ని మందులకు ఒకే రూల్ లేదు. మందుల ధరలు తగ్గించి పేషెంట్లకు రిలీఫ్ ఇచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే చర్చ మొదలైంది. మందుల ధరల్లో ఇంత తేడా ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.



