← Back to news

రోడ్డు పైనే వ్యవసాయం!

By sahani· 7 Aug 2026· mulugu

మంత్రి సీతక్క నియోజకవర్గంలోని ములుగు జిల్లా, మంగపేట మండలం కొత్తమల్లూరులో రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడంతా బురదగా మారి నడవడమే కష్టంగా మారింది. రోడ్ల అధ్వాన పరిస్థితిపై విసిగిపోయిన ఊరి జనాలు డిఫరెంట్‌గా నిరసన తెలిపారు. ఆ బురద రోడ్డుపైనే వరి నాట్లు వేస్తూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు ప్రాబ్లమ్‌ని వెంటనే సాల్వ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

More in News