అడవి పంది అటాక్.. 2 గంటలు పోరాడిన బాలుడు!
ఒడిశా రాష్ట్రం కటక్ దగ్గరలో షాకింగ్ ఘటన జరిగింది. కెనాల్‌లో స్నానం చేస్తున్న 14 ఏళ్ల బాలుడిపై అడవి పంది సడన్‌గా అటాక్ చేసింది. భయపడకుండా బాలుడు 2 గం. పాటు దానితో పోరాడాడు. ప్రాణాలు కాపాడుకునేందుకు దాని మెడను వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. చివరికి స్థానికులు అక్కడికి చేరుకుని బాలుడిని కాపాడారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో బాలుడి ధైర్యానికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.



