← Back to news

‘నా స్మృతిలో చేగువేరా’ - పుస్తకం

By విశీ· 13 Aug 2026
‘నా స్మృతిలో చేగువేరా’ - పుస్తకం

క్యూబా విప్లవ నాయకుడు ఫిడెల్ కాస్ట్రో రాసిన ప్రసిద్ధ పుస్తకానికి తెలుగు అనువాదం ఈ పుస్తకం. చేగువేరా జీవితంలాగే ఆయన మరణంపై అనేక కథలు, వదంతులు వ్యాపించాయి. వాటికి సమాధానంగా కాస్ట్రో చేసిన ప్రసంగాలు, రచనలు, ఇంటర్వూల సంకలనం ఇది. చేగువేరాతో తన అనుబంధాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, విప్లవ ప్రయాణాన్ని, ఆయన మరణం తాలూకు నిజాలను ఈ పుస్తకంలో కాస్ట్రో కళ్లకు కట్టినట్లు వివరించారు. ప్రజాశక్తి బుక్ హౌస్, నవతెలంగాణ బుక్‌హౌస్ సంస్థలు దీన్ని తెలుగులో ప్రచురించాయి. ధర రూ.200. కొనేందుకు <a href="https://www.amazon.in/-/hi/Fidel-Castro/dp/B078LCJCCN">లింక్</a>.

More in Books

'ద్రవిడ - వివక్షపై దక్షిణ స్వరం' పుస్తకం
Books· 12 Aug 2026

'ద్రవిడ - వివక్షపై దక్షిణ స్వరం' పుస్తకం

మలుపు బుక్స్, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక కలిసి తీసుకొచ్చిన పుస్తకం 'ద్రవిడ - వివక్షపై దక్షిణ స్వరం'. రచయితలు కల్లూరి భాస్కరం, సౌదా అరుణ, డా.జిలుకర శ్రీనివాస్, రాహుల్, కె.శ్రీనివాస్, కె.ఎన్.మల్లీశ్వరి, కాత్యాయనీ విద్మహే, సి.మృణాళిని రాసిన పదకొండు ఆర్టికల్స్ ఇందులో ఉన్నాయి. ద్రావిడ జాతులపై వివక్ష, ద్రవిడ భాష, సంస్కృతి, సాహిత్యం ద్వారా అస్మిత నిర్మాణం లాంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకానికి ఎడిటర్స్‌గా కె.ఎన్.మల్లీశ్వరి, కాత్యాయనీ విద్మహే ఉన్నారు. పుస్తకం ధర రూ.150. పుస్తకం కొనేందుకు <a href="https://www.telugubooks.in/products/dravida-vivakshapai-dakshina-swaram?srsltid=AfmBOoqOJwWA4xUicb-zqftKrUpqFkRMq-DrY2VrCkDrfuIxhL5bboDB">లింక్</a>.