← Back to news

‘ఇలాంటివి లైట్‌గా తీసుకోం’.. నిందితుడిపై సుప్రీం ఫైర్

By Mahesh· 1h ago· Delhi
‘ఇలాంటివి లైట్‌గా తీసుకోం’.. నిందితుడిపై సుప్రీం ఫైర్

దిల్లీ CJP నిరసనల్లో పాల్గొన్న మైనర్ స్టూడెంట్, ఆమె తండ్రిపై బెదిరింపులకు పాల్పడిన కేసులో నిందితుడు స్వతంత్ర భరద్వాజ్‌పై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. నిరసనల తర్వాత బాధితురాలిని రేప్ చేస్తామని బెదిరించినట్టు వచ్చిన ఆరోపణలపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. మైనర్, ఆమె తండ్రిని బెదిరించడం, వేధించడం లైట్‌గా తీసుకోలేమని తేల్చి చెప్పింది. NEET పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్‌లో నిరసన తర్వాత ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. భరద్వాజ్ ప్రస్తుతం 14 రోజుల జుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

More in National