ఈ రోబో డాన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
రోబోల కదలికలు మనుషుల్లా నాచురల్‌గా ఉండేలా భారత్‌కు చెందిన 'ట్యూస్‌డే ల్యాబ్స్', 'మాస్టర్స్ యూనియన్' కలిసి 'మాయ' అనే హ్యూమనాయిడ్ రోబోను డెవలప్ చేశాయి. 'అవతార్' మూవీలో వాడిన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్‌తో దీనికి ట్రైనింగ్ ఇచ్చారు. 'వజ్లే కీ బారా' మరాఠీ పాటకు ఒక క్లాసికల్ డ్యాన్సర్‌లా మాయ చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు, రోబోలకు నేచురల్ మూవ్‌మెంట్స్ కోసం మేరీల్యాండ్ రీసెర్చర్స్ భరతనాట్యం ముద్రల సాయంతో AI ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నారు.


