← Back to news

AIకి నైతిక విలువలు.. మంచి నడవడి నేర్పండి!

By Anusha· 4 Oct 2026
AIకి నైతిక విలువలు.. మంచి నడవడి నేర్పండి!

ఏఐ సంస్థ ఆంథ్రోపిక్.. న్యూయార్క్ వేదాంత సొసైటీ అధిపతి స్వామి సర్వప్రియానంద నుంచి సూచనలు తీసుకుంది. ఆన్‌లైన్ ఇంటర్వ్యూ కోసం సంప్రదించిన సంస్థ.. తర్వాత శాన్‌ఫ్రాన్సిస్కోలోని కార్యాలయానికి స్వామిని ఆహ్వానించింది. అక్కడ చర్చల్లో ఆయన పాల్గొన్నారు. క్లౌడ్ ఏఐ మోడళ్లకు నైతిక విలువలు నేర్పే అంశంపై సలహాలు తీసుకున్నట్లు స్వామి తెలిపారు. వివిధ మత నేతలు, కౌన్సెలర్లు, మానసిక ఆరోగ్య నిపుణులతోనూ చర్చలు జరిగాయని చెప్పారు.

More in Technology