ఉప్పుని పూర్తిగా బంద్ చేస్తున్నారా?

ఆరోగ్యం కోసం చాలామంది ఉప్పును పూర్తిగా దూరం పెడుతుంటారు. కానీ మన బాడీకి సోడియం చాలా అవసరమని డాక్టర్లు అంటున్నారు. ఇది బాడీలో వాటర్ లెవెల్స్ తగ్గకుండా, మజిల్స్ సరిగ్గా పనిచేసేలా చూస్తుంది. ఎక్కువ ఎండలో తిరిగినా, వర్కౌట్స్ చేసి చెమటలు పట్టినా కేవలం నీళ్లు తాగితే సరిపోదు, బాడీకి ఎలక్ట్రోలైట్స్, సోడియం అవసరం. అందుకే ఉప్పును మరీ పూర్తిగా పక్కన పెట్టేయొద్దని డాక్టర్లు చెప్తున్నారు.



