← Back to news

బిహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌధరి ? కాసేపట్లో నితీశ్ రాజీనామా

By aravinda nyayapati· 14 Apr 2026· Telugu Report· Hyderabad
బిహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌధరి ? కాసేపట్లో నితీశ్ రాజీనామా

బిహార్ కొత్త సీఎం రేసులో ఆ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సామ్రాట్ చౌధరి ముందున్నారు. ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్ రాజ్యసభకు ఎంపిక కావడంతో ఆయన ఈ రోజు రాజీనామా చేస్తున్నారు. నితీశ్ రాజీనామాతో బిహార్ లో ఒక శకం ముగిసిపోనుంది. సాయంత్రం 4 గంటలకి ఎన్డీయే భేటీలో కొత్త సీఎం ఎవరన్న దానిని నిర్ణయిస్తారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ సెంట్రల్ అబ్జర్వర్ గా బాధ్యతలు నిర్వహిస్తారు. సామ్రాట్ పేరు దాదాపుగా ఖరారైపోయింది. రాష్ట్రంలో పవర్ పుల్ ఒబిసికి చెందిన కొయిరీ కులానికి చెందిన వ్యక్తి. 2023లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడయ్యాడు. గత ఏడాది డీప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. రేపు ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో కొత్త సీఎం, కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు.

More in Politics