హెరాయిన్ వదిలి.. ఫార్మా డ్రగ్స్ వైపు

పంజాబ్‌లో డ్రగ్స్ వాడుతున్న యూత్ కొత్త రూట్ ఎంచుకుంటున్నారు. హెరాయిన్‌కు బదులుగా ఫార్మా డ్రగ్స్ వాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఫార్మా డ్రగ్స్‌ను అక్రమంగా పంజాబ్‌కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2025 నుంచి 11.54 లక్షల క్యాప్సూల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు డ్రోన్ ఆధారిత నార్కోటిక్స్ నిరోధక వ్యవస్థతోపాటు బీఎస్‌ఎఫ్, పోలీసుల చర్యలు కొనసాగుతున్నాయి.



