పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం!
TG: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో మదీనా ప్రాంతంలో బాంబే హౌసరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటల నుంచి ఎక్కువగా పొగ వెలువడుతుండటంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మంటలు ఇతర షాపులకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. హోల్‌సేల్ క్లాత్ మార్కెట్ కావడంతో భారీగా ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

