కోనేరులోకి దూసుకెళ్లిన కారు
TG: రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని శివగంగ రాజరాజేశ్వర ఆలయ కోనేరులోకి ఇన్నోవా క్రిస్టా కారు దూసుకెళ్లి నీటిలో మునిగిపోయింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ డోర్ తెరిచి బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. కారులో డ్రైవర్ ఒక్కరే ఉండటంతో ప్రాణనష్టం జరగలేదు. కారు అదుపుతప్పి కోనేరులోకి దూసుకెళ్లడానికి అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు.

