← Back to news

19 ఏళ్ల స్టూడెంట్ దారుణ హత్య

By BK· 6h ago· జగిత్యాల
19 ఏళ్ల స్టూడెంట్ దారుణ హత్య

TG : జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరాంపల్లిలో తెల్లవారుజామున 19 ఏళ్ల బొంత సంతోష్‌ను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. సంతోష్ జనగామకు చెందిన వ్యక్తి కాగా, అతని కుటుంబం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి వలస వెళ్ళింది. అక్కడ సంతోష్‌ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మృతదేహాన్ని జగిత్యాల హాస్పిటల్‌కు తరలించారు. ఈ హత్యకు సంబందించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

More in TG