← Back to news

కడపలో కంకర రాళ్లు.. భారీ కుట్ర?

By Krishna· 1d ago
కడపలో కంకర రాళ్లు.. భారీ కుట్ర?

AP: ఆంధ్రప్రదేశ్.. కడప జిల్లాలోని గాంధీ నగర్ స్కూల్ నామినేషన్ కేంద్రం దగ్గర ఎవరో కంకర రాళ్లను డంప్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్టోబర్ 16న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఇవాళ్టితో ముగుస్తుంది. గత రెండు రోజులూ TDP, YCP వర్గాల మధ్య భారీ ఘర్షణలు జరిగాయి. ఇవాళ హింసకు పాల్పడాలనే ఉద్దేశంతోనే కంకర రాళ్లను డంప్ చేశారా అనే సందేహాలు కలుగుతున్నాయి. తమను నామినేషన్ వెయ్యకుండా చెయ్యడానికి TDPయే వాటిని డంప్ చేయించిందని YCP ఆరోపిస్తోంది.

కడపలో కంకర రాళ్లు.. భారీ కుట్ర?

More in AP