మగవారికీ ఛైల్డ్ కేర్ లీవ్స్ - జీవో 70 సవరించిన ఏపీ ప్రభుత్వం

వివాహితులైన మహిళలతో పాటు, పురుషులు కూడా ఛైల్డ్ కేర్ లీవ్ కు అర్హులేనంటూ ఏపీ ప్రభుత్వం జీవోను సవరించింది. అవివాహిత పురుషులు, భార్య చనిపోయినవారు, ఒంటరి పురుషులు సైతం, ఈ లీవును వాడుకోడానికి అర్హులే. అర్హులైన ప్రతి ఉద్యోగి తమ మొత్తం సర్వీస్ కాలంలో గరిష్టంగా 180 రోజులు (6 నెలలు) చైల్డ్ కేర్ లీవ్‌ను వాడుకోవచ్చు. గరిష్టంగా ఇద్దరు పిల్లల సంరక్షణ కోసం మాత్రమే ఈ సెలవులను అనుమతిస్తారు. జీవో 70 ప్రకారం పిల్లల సంరక్షణలో వయో పరిమితి నిబంధనలను ఎత్తేశారు. ఈ 180 రోజుల సెలవును గరిష్టంగా పది విడతల్లో వాడుకోవచ్చు



