← Back to news

🚀 కాన్ఫిడెన్స్ పెంచే 3 సింపుల్ ట్రిక్స్!

By siddu vinay· 2d ago
🚀 కాన్ఫిడెన్స్ పెంచే 3 సింపుల్ ట్రిక్స్!

స్టేజ్ ఎక్కాలన్నా, ఇంటర్వ్యూకి వెళ్లాలన్నా కంగారుగా ఉందా? కాన్ఫిడెన్స్ అంటే భయం లేకపోవడం కాదు... భయమున్నా ధైర్యంగా ముందడుగు వేయడమే! ప్రెజెంటేషన్ ముందు మీకు ఇష్టమైన మ్యూజిక్ వింటే వెంటనే మంచి బూస్ట్ దొరుకుతుంది. అలాగే "నా వల్ల కాదు" అని ఆగిపోకుండా "ప్రయత్నిస్తే నేర్చుకోవచ్చు" అనే మైండ్‌సెట్ పెంచుకోవాలి. క్రికెట్‌లో ప్రతి బాల్‌కీ సిక్స్ కొట్టలేం కదా! అలాగే జీవితంలో కూడా పొరపాట్లు సహజమని గుర్తించి వాటి నుండి నేర్చుకుంటూ ముందుకు సాగితే మీ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా పెరుగుతుంది!

More in Motivational

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?
Motivational· 2d ago

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?

వందమంది మనల్ని మెచ్చుకున్నా.. ఒక్కరు “బాగా చేయలేదు” అంటే ఆ మాటే రోజంతా మన తలలో తిరుగుతుంది. ఇది మనలో ఏదో లోపం ఉందని కాదు.. మెదడు నెగెటివ్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా పనిచేయడమే కారణం. ప్రమాదాలు, విమర్శలు, తిరస్కరణలు గుర్తుపెట్టుకోవడం మనుగడకు ఉపయోగపడేది. అందుకే మంచి అనుభవాల కంటే చెడు మాటలు ఎక్కువగా గుర్తుండిపోతాయి. అయితే ప్రతి కామెంట్ నిజం కాదు. ఒక్కరి అభిప్రాయాన్ని మన విలువకు కొలమానంగా మార్చుకుంటే.. వంద నిజమైన ప్రశంసల విలువను మనమే తగ్గించినట్టే. అది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే.