అయ్యో పాపం: చిన్నారి బాడీలో ఇరుక్కుపోయిన సూది!

మహారాష్ట్ర ఠాణేలోని మున్సిపల్ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం బయటపడింది. రేబీస్ వ్యాక్సిన్ కోసం వచ్చిన మూడేళ్ల బాలుడికి ఇంజెక్షన్ ఇస్తుండగా సూది విరిగి శరీరంలోనే ఉండిపోయింది. డాక్టర్లు ఆ విషయం పట్టించుకోకుండా చిన్నారిని ఇంటికి పంపేశారు. పాప తీవ్ర నొప్పితో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు ముంబైలోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఎక్స్‌రే తీసి, సర్జరీ ద్వారా సూదిని బయటకు తీశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.



