← Back to news

రాబోయే రోజుల్లో డాక్టర్ల కొరత.. WHO అలర్ట్

By Lokesh· 20 Sept 2026
రాబోయే రోజుల్లో డాక్టర్ల కొరత.. WHO అలర్ట్

ప్రపంచవ్యాప్తంగా రాబోయే పదేళ్లలో డాక్టర్ల కొరత పెరిగే ప్రమాదం ఉందని WHO హెచ్చరించింది. 122 దేశాల డేటా ప్రకారం.. ప్రస్తుతం ఉన్న వైద్యుల్లో దాదాపు 25% మంది 55 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారే. వీరిలో చాలామంది రాబోయే పదేళ్లలో రిటైర్ కానున్నారు. వారి స్థానాలను భర్తీ చేసేంతమంది కొత్త సిబ్బంది సిద్ధంగా లేరని రిపోర్టు తెలిపింది. 2030 నాటికి 67 దేశాల్లో ప్రజల ఆరోగ్య అవసరాలకు సరిపడా వైద్య సిబ్బంది ఉండకపోవచ్చని WHO చెప్పింది.

More in Health