← Back to news

పూలతో డ్రెస్‌కు ట్రెండీ మేకోవర్‌!

By Anusha· 18 Sept 2026
పూలతో డ్రెస్‌కు ట్రెండీ మేకోవర్‌!

పాత టీషర్ట్లు, ప్యాంట్లు, టోట్‌ బ్యాగులకు కొత్త లుక్‌ ఇవ్వాలంటే పూల స్టాంపింగ్‌ DIY ట్రై చేయొచ్చు. కాటన్‌ లేదా లినెన్‌ దుస్తులను ఎంచుకుని, ఫెర్న్‌, డైసీ, బంతి వంటి చదునైన పూలు, ఆకులకు ఫ్యాబ్రిక్‌ పెయింట్‌ పూయాలి. వాటిని దుస్తులపై ఉంచి బటర్‌ పేపర్‌తో గట్టిగా నొక్కాలి. 24 గంటలు ఆరనిచ్చి, వెనుక వైపు వేడి ఇస్త్రీ చేస్తే ప్రింట్‌ ఎక్కువకాలం ఉంటుంది. రంగు వెనుకకు ఇంకకుండా లోపల కార్డ్‌బోర్డ్‌ పెట్టాలి.

More in Gen Z