← Back to news

ఒంటి కాలితోనే.. కుంటుతూ బడికెళ్తోంది

By Vishi· 2d ago· Aajtak

UPలోని బల్లియా జిల్లా మానియర్ బ్లాక్‌లోని రానీపూర్ గ్రామానికి చెందిన రాగిణికి ఏడేళ్లు. ఆరు నెలల వయసులోనే రోడ్డు ప్రమాదంలో ఒక కాలు పోయింది. తను 1వ తరగతి చదువుతోంది. ఇంటి నుంచి 400 మీటర్ల దూరంలోని బడికి ఒంటికాలితో గెంతుతూ వెళ్తోంది. అయినా చదువు మాత్రం విడిచిపెట్టలేదు. SMలో వైరల్ అయిన తన ఉదంతం జిల్లా కలెక్టర్ మంగళా ప్రసాద్ సింగ్‌ను కదిలించింది. ఆయన రాగిణి ఇంటికి వచ్చి ట్రైసైకిల్, పుస్తకాలు, బొమ్మలు ఇచ్చారు. AAP నాయకులు ఆర్థికసాయం అందించారు. కృత్రిమ కాలు పెట్టిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

More in Motivational

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?
Motivational· 2d ago

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?

వందమంది మనల్ని మెచ్చుకున్నా.. ఒక్కరు “బాగా చేయలేదు” అంటే ఆ మాటే రోజంతా మన తలలో తిరుగుతుంది. ఇది మనలో ఏదో లోపం ఉందని కాదు.. మెదడు నెగెటివ్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా పనిచేయడమే కారణం. ప్రమాదాలు, విమర్శలు, తిరస్కరణలు గుర్తుపెట్టుకోవడం మనుగడకు ఉపయోగపడేది. అందుకే మంచి అనుభవాల కంటే చెడు మాటలు ఎక్కువగా గుర్తుండిపోతాయి. అయితే ప్రతి కామెంట్ నిజం కాదు. ఒక్కరి అభిప్రాయాన్ని మన విలువకు కొలమానంగా మార్చుకుంటే.. వంద నిజమైన ప్రశంసల విలువను మనమే తగ్గించినట్టే. అది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే.