పిల్లల ఆరోగ్యానికి ఇదే బెస్ట్ ఫుడ్

పిల్లలకు ప్యాకెట్ ఫుడ్స్, స్నాక్స్ ఇవ్వకూడదని పిల్లల ఆరోగ్యం, ఎదుగుదలకు హెల్తీ ఫుడ్ చాలా ముఖ్యం అని నిపుణులు చెప్తున్నారు. వారు వద్దంటే బలవంతంగా ఆహారం తినిపించకూడదని సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఆహారంపై వారికి ఇష్టం తగ్గొచ్చంటున్నారు. గింజలు, అవకాడో, చేపలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వు ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి. పండ్లు, కూరగాయలను రోజూ తినిపించాలి. ఆడుకునే టైంలో షుగర్ ఎక్కువగా ఉండే ఎనర్జీ డ్రింక్స్‌కు బదులుగా నీరు ఇవ్వడం మంచిదంటున్నారు.



