← Back to news

మాట్లాడే ముందు.. ప్రజల మాట వినాలి!

By Vishnu· 2 Oct 2026· Josha-journal
మాట్లాడే ముందు.. ప్రజల మాట వినాలి!

గాంధీజీ గొప్పతనం మాటలు చెప్పడంలో లేదు, మాటలు వినడంలో ఉంది. 1917 చంపారన్ సత్యాగ్రహం ఆయనను దేశస్థాయి నాయకుణ్ని చేసింది. నీలిమందు సాగుతో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు, బెదిరింపులు, జరిమానా వివరాలను గాంధీ నమోదు చేశారు. రైతులు చెప్పిన విషయాలను రాతపూర్వకంగా నమోదు చేసి, వారి వేలిముద్రలను కూడా తీసుకున్నారు. ప్రజల కోసం మాట్లాడే ముందు, ప్రజల మాట వినడమే నాయకత్వంలో ముఖ్యమైన విషయమని మనం గుర్తించాలి. కేవలం మాట్లాడటం మీదే కాకుండా వినడం మీద దృష్టి పెట్టాలి.

More in Motivational