భారీ బడ్జెట్ మూవీలన్నీ రెండు భాగాలేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్'. మొదట ఈ సినిమాను ఒకే భాగంగా అనుకున్నప్పటికీ, కథా పరిధి పెద్దది కావడంతో దీన్ని కూడా రెండు భాగాలుగా తీసుకురావడానికి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఇటీవలే తారక్ సూచనలతో స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు చేశారట. ఈ భారీ ప్రాజెక్ట్‌లో అనిల్ కపూర్, రుక్మిణి వసంత్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ క్రియేట్ చేస్తున్న ఈ సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ రెండు భా గాలుగా వస్తే అభిమానులకు పండగే!



