35 ఏళ్ల నాటి ‘ఫేక్ ఎన్‌కౌంటర్’ కేసు..రిటైర్డ్ పోలీసులపై FIR

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో 35 సంవత్సరాల క్రితం జరిగిన ఒక నకిలీ ఎన్‌కౌంటర్, అక్రమ కేసుల వ్యవహారంలో 12 మంది రిటైర్డ్ పోలీసు అధికారులపై కేసు నమోదైంది. 1991లో కాన్పూర్‌లోని శ్యామ్‌నగర్ వద్ద ప్లాట్లు అమ్మే వ్యాపారం చేస్తున్న దేవ్ ప్రసాద్ పాఠక్‌ను 400 చదరపు గజాల ప్లాట్‌ను ఉచితంగా ఇవ్వాలని అప్పటి మహారాజ్‌పూర్ SHO విద్యాసాగర్ త్రిపాఠి డిమాండ్ చేశారు. అందుకు నిరాకరించడంతో పోలీసులు దొంగ కథ అల్లి కేసు పెట్టారు. 35 ఏళ్ల తర్వాత అసలు నిజం బయటపడింది.



