← Back to news

చెన్నైకి దగ్గర్లో అల్పపీడనం

By Krishna· 1h ago· Gov
చెన్నైకి దగ్గర్లో అల్పపీడనం

చెన్నైకి 200 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఉంది. దాని సుడిగాలులు గంటకు 35 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాయి. అది ఉత్తర శ్రీలంక వైపు వెళ్తోంది. అయినప్పటికీ దాని ప్రభావం AP, తెలంగాణపై ఉండబోతోంది. ఇవాళ అక్టోబర్ 20 నాడు మేఘాల వాతావరణం ఉంటుంది. ఎండ కూడా ఉంటుంది. APలో కొన్నిచోట్ల లైట్ రెయిన్ పడొచ్చు. ఉష్ణోగ్రత తెలంగాణలో 33, APలో 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో అక్టోబర్ 26 వరకూ అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడతాయని IMD తెలిపింది.

More in Current Affairs