← Back to news

బీపీ, షుగర్‌, కిడ్నీ సమస్యలకు ఒకే చికిత్స విధానం!

By A.Ajay· 5 Oct 2026
బీపీ, షుగర్‌, కిడ్నీ సమస్యలకు ఒకే చికిత్స విధానం!

బీపీ, షుగర్‌, కిడ్నీ సమస్యలను విడివిడిగా కాకుండా ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న సమస్యలుగా చూసి చికిత్స అందించాలని వైద్య నిపుణులు సూచించారు. ‘వారణాసి డిక్లరేషన్‌ 2026’లో ఈ సమస్యలపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ మూడు సమస్యలు ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు కూడా పెరుగుతుందని తెలిపారు. అందుకే 35 ఏళ్లు దాటిన వారికి బీపీ, షుగర్‌, కిడ్నీ పనితీరుపై పరీక్షలు చేయాలని సూచించారు. దేశంలో ప్రజలకు సులభంగా పరీక్షలు, సరైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

More in Health