ప్రకృతి నియమాలను అర్థం చేసుకునే కొత్త AI

కర్ణాటకలోని మైసూరుకు చెందిన సైంటెస్ట్ అనిమా ఆనంద్‌కుమార్ కొత్త తరహా AIపై పనిచేస్తున్నారు. సాధారణ AI మనం ఇచ్చే మాటలు, చిత్రాలు, కోడ్ ఆధారంగా సమాధానాలు ఇస్తుంది. కానీ ఆమె రూపొందిస్తున్న AI ప్రకృతిలో జరిగే మార్పులను అర్థం చేసుకుని వాటిని ముందుగా అంచనా వేయడంపై దృష్టి పెడుతోంది. వాతావరణం, చిప్‌ల తయారీ, రోబోలు, వైద్యం వంటి రంగాల్లో ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. ఇందుకోసం ఆమె బెనెడిక్ట్ జెనిక్‌తో కలిసి ‘Accelerated Understanding’ సంస్థను ప్రారంభించారు.



