పాక్ హనీట్రాప్ కేసులో..ఇద్దరు అరెస్ట్

పాక్‌కు రక్షణ రహస్యాల చేరవేతపై ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ ‘ఆపరేషన్ ఫైర్‌వాల్-2026’ చేపట్టింది. 10 రాష్ట్రాల్లో ఇన్వెస్టిగేషన్ చేసి 18 మంది అనుమానితులను గుర్తించారు. వీరిలో 13 మంది నేవీ సిబ్బంది ఉన్నారు. వైజాగ్‌లో నేవల్ బేస్ కాంట్రాక్ట్ డ్రైవర్ అన్నం వరప్రసాద్, కోయంబత్తూరులో నేవీ ఉద్యోగి ప్రదీప్ ముఖర్జీని అరెస్టు చేశారు. పాక్ నిఘా వర్గాలకు నేవీ, రక్షణ సంస్థల సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ చేరవేశారన్న ఆరోపణలతో ఇద్దరికీ అక్టోబర్ 14 వరకు రిమాండ్ విధించారు.



